భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..పాలమూరు బస్తీలో డ్రైనేజ్ పైప్ లైన్లను మార్చాలి….
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలి
సిపిఐఎం డిమాండ్
బస్తీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సిపిఐఎం ముషీరాబాద్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో నేడు బాల్ లింగంపల్లి డివిజన్లో పాలమూరు బస్తీలో పాదయాత్ర నిర్వహించడం జరిగింది.
ఈ పాదయాత్రకు ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి వర్గ సభ్యులు ఎం దశరథ్ మాట్లాడుతూ పాలమూరు బస్తీలో అనేక సంవత్సరాల క్రితం వేసిన డ్రైనేజ్ పైప్ లైన్ ఉండడంతో వారానికి రెండు మూడుసార్లు డ్రైనేజ్ పైప్ లైన్లు నిండి బస్తీలో ప్రవహిస్తున్నాయని, డ్రైనేజీ నిండిపోయింది అని అధికారులకు కంప్లైంట్ చేసిన వెంటనే స్పందించడం లేదని, బస్తీ అవసరాలకు అనుగుణంగా బస్తీలోని డ్రైనేజీ పైప్ లైన్లను మార్చి పెద్ద పైప్ లైన్ వేయాలని డిమాండ్ చేశారు. బస్తీలో దోమలు విపరీతంగా ఉన్నాయని జిహెచ్ఎంసి అధికారులు రెగ్యులర్గా ఫాగింగ్ నిర్వహించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 గ్యారంటీలో భాగంగా బస్తీలో అర్హులైనటువంటి వితంతులు, వృద్ధులకు పెన్షన్లు మంజూరు చేయాలని , బస్తీలోని పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఈ పాదయాత్రలో ముషీరాబాద్ జోన్ కార్యదర్శి ఆర్ వెంకటేష్, కార్యదర్శివర్గ సభ్యులు కే రమేష్, నాయకులు మల్లయ్య, పెద్దయ్య, ఎల్లయ్య, రాజు, నరసింహ, పౌల్ తదితరులు పాల్గొన్నారు.
ధన్యవాదములుతో,

ఆర్ వెంకటేష్
కార్యదర్శి
సిపిఎం ముషీరాబాద్ జోన్ కమిటీ