భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..విచారణకు వచ్చిన తల్లికి అండగా.. పసిబిడ్డను ఎత్తుకున్న మహిళా కానిస్టేబుల్
మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ మహిళా కోర్టు కానిస్టేబుల్ దీప.. ఎల్బీ నగర్ స్పెషల్ పోక్సో కోర్టుకు చంటి బిడ్డతో వచ్చిన బాధితురాలికి అండగా నిలిచారు.

విచారణ సమయంలో తల్లి ఇబ్బంది పడకుండా పసికందును తన చేతుల్లోకి తీసుకుని ఆలనా పాలనా చూశారు. దీప చూపిన మానవత్వాన్ని న్యాయవాదులు, పోలీసు సిబ్బంది అభినందించారు.