తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటన – పూర్తి షెడ్యూల్ ఇదే

భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటన – పూర్తి షెడ్యూల్ ఇదే

తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు గుడ్ న్యూస్. దసరా పండుగ సందర్భంగా పాఠశాలలకు సెలవుల షెడ్యూల్ విడుదలైంది.

తెలంగాణలో:
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు అక్టోబర్ 10 నుండి 22 వరకు (13 రోజులు) దసరా సెలవులు ప్రకటించారు. తిరిగి అక్టోబర్ 23న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. జూనియర్ కళాశాలలకు అక్టోబర్ 10 నుండి 21 వరకు సెలవులు ఉంటాయి.

ఆంధ్రప్రదేశ్‌లో:
ఏపీలో వారాంతపు సెలవులతో కలిపి అక్టోబర్ 10 నుండి 21 వరకు పాఠశాలలకు సెలవులు వర్తిస్తాయి. అక్టోబర్ 22న స్కూళ్లు తిరిగి తెరుచుకుంటాయి.

సెలవుల సమయంలో ఎలాంటి ప్రత్యేక తరగతులు నిర్వహించరాదని విద్యాశాఖ స్పష్టంగా ఆదేశించింది.