పోతనపల్లి అటవీ ప్రాంతంలో పులి సంచారం !ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారుల హెచ్చరిక

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు..పోతనపల్లి అటవీ ప్రాంతంలో పులి సంచారం !
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారుల హెచ్చరిక

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పోతనపల్లి అటవీ ప్రాంతంలోని పోలవరం గండి చెరువు సమీపంలో పులి సంచరించినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అటవీ ప్రాంత పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

పులి సంచారంపై సమాచారం అందడంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రాత్రంతా అటవీ ప్రాంతంలో పులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ప్రజలు రాత్రి సమయాల్లో ఒంటరిగా అటవీ ప్రాంతాలకు వెళ్లవద్దని, పశువులను మేతకు తీసుకెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పులి కనిపించినా, దాని అడుగుజాడలు గుర్తించినా వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.

ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు.