రాగి తీగలను దొంగిలిస్తున్న అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి రాగి తీగలను దొంగిలిస్తున్న అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్ – కారు, మోటార్ సైకిల్, టూల్ కిట్స్, రాగి వైర్ స్వాధీనం.

	ఏలూరుజిల్లా, సూపరింటెండెంట్ అఫ్ పోలీస్, శ్రీ K.Prathap Siva Kishore, IPS., వారి పర్యవేక్షణలో, జంగారెడ్డిగూడెం Sub-Divisional Police Officer B.H.Venkateswarlu, గారి సూచనల మేరకు, జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ M.V.Subhash గారి పర్యవేక్షణలో 
	లక్కవరం  పోలీస్ స్టేషన్ Cr.No.77/2026, U/s U/s 303(2)BNS, & 136 (1) (A) ELA, & Sec 3 PDPPA Act  కేసులో లక్కవరం SI SK.జబీర్  గారు తమ సిబ్బంది కలసి ది.27.10.2026 వ తేది ఉదయం 07.00 గంటలకు ఏలూరు రోడ్డులోని గుర్వాయిగూడెం గ్రామ సమీపంలో గల జీడిగింజల ఫ్యాక్టరీ వద్ద  మధ్యవర్తుల సమక్షంలో వాహన తనిఖీలు చేస్తూ ఈ తనిఖీల్లో AP05 DL 3333 గల క్రిటా కార్ మరియు ఒక  మోటార్ సైకిల్ లను  ఆపి, వాటిలో ప్రయాణిస్తున్న 5 మంది ముద్దాయిలను మరియు 1 జువైనల్ ను  అదుపులోకి తీసుకున్నారు.

ముదాయిల వివరాలు:
1 A-1: కోడూరి రవితేజ (28 సం.), తండ్రి: మోహన్, తూర్ల లక్ష్మీపురం గ్రామం, ద్వారకా తిరుమల మండలం.(ఇతనిపై ద్వారకతిరుమల పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్, జంగారెడ్డిగూడెం పోలిస్ స్టేషన్ లో సస్పెక్ట్ షీట్ ఉంది. గతంలో నకిలీ నోట్ల చెలామణి, చీటింగ్, దోపిడీ, హత్య సహా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 32 కేసులు నమోదై ఉన్నాయి.)
2 A-2: చుండ్రు అనిల్ కుమార్ (27 సం.), తండ్రి: కృష్ణ, NVN కాలనీ, చింతలపూడి గ్రామం మరియు మండలం.(గతంలో ఇతనిపై 10 కాపర్ వైర్ దొంగతనం కేసులు ఉన్నాయి.)
3.A-3: అన్యం లోకేష్ (19 సం.), తండ్రి: రామస్వామి, కోర్టు సమీపంలో, రాముడుకుంట చెరువు, రెడ్డిగూడెం గ్రామం మరియు మండలం.
4 A-4: దగ్గుపల్లి జోగ మారేష్ (22 సం.), తండ్రి: వెంకట గణపతి, గాంధీనగర్, కొలమూరు గ్రామం, ఉండి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా.(ఇతనిపై గతంలో గణపవరం PS లో 2 గంజాయి కేసు ఉంది.)
5.A-5: మువ్వా జగన్ (22 సం.), తండ్రి: రమేష్, హరిజనపేట, కొలమూరు గ్రామం, ఉండి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా
6.జువైనల్ (17 సం).
నేర విధానం (Modus Operandi):
రౌడీషీటర్ అయిన A-1 కోడూరి రవితేజ జంగారెడ్డిగూడెం పోలిస్ స్టేషన్ కు చెందిన attempt మర్డర్ కేసులో ఏలూరు జైలులో ఉన్న సమయంలో A2(చింతలపూడి PS ట్రాన్స్ఫార్మర్ దొంగతనం కేసులో), A-4 జోగ మారేష్‌ ( గణపవరం PS లో గంజాయి కేసు) లు కూడా ఏలూరు జైలులో ఉండగా పరిచయం ఏర్పడింది.

ఈ సంవత్సరం అనగా 2026 జూన్, జులై నెలలలో ముగ్గురు జైలు నుంచి విడుదలైన తర్వాత సులభంగా డబ్బు సంపాదించేందుకు మిగిలిన నిందితులతో కలిసి ఒక ముఠాను ఏర్పాటు చేశాడు.

ట్రాన్స్‌ఫార్మర్లను సులువుగా పగులగొట్టడానికి రాజమండ్రి నుండి ప్రత్యేక యంత్రాలు, టూల్ కిట్లను తయారు చేయించుకున్నారు.

రాత్రి వేళల్లో కారు, మోటార్ సైకిల్‌పై తిరుగుతూ ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లోని వ్యవసాయ పొలాల్లో అమర్చిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను టార్గెట్ చేసి, వాటిని ధ్వంసం చేసి లోపల ఉండే విలువైన కాపర్ వైరును దొంగిలించి విక్రయించేవారు.

అరెస్టు & స్వాధీనం చేసుకున్న సొత్తు:

ఈ రోజు (ది. 27-10-2026) ఉదయం సుమారు 11.15 గంటల సమయంలో ఏలూరు రోడ్డులోని గుర్వాయిగూడెం గ్రామ సమీపంలో గల జీడిగింజల ఫ్యాక్టరీ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న 5 ముద్దాయిలను అరెస్ట్ చేసి, ఒక జువైనల్ ను లక్కవరం ఎస్.ఐ Sk. జబీర్ మరియు సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న వస్తువులు:
నేరాలకు ఉపయోగించిన AP05 DL 3333 గల క్రిటా కార్
1 మోటార్ సైకిల్
 ట్రాన్స్‌ఫార్మర్లు పగులగొట్టే ప్రత్యేక టూల్ కిట్స్
13 కేసులలో మొత్తం 35 ట్రాన్స్‌ఫార్మర్లు కు సంబందించి 1020 K.G. ల రాగి వైర్
( రికవరీ సొత్తు విలువ Rs: 10,00,000/-)
సంబంధిత కేసుల వివరాలు (మొత్తం 35 ట్రాన్స్‌ఫార్మర్లు):
జంగారెడ్డిగూడెం P.S: క్రైమ్ నెం. 277/2026 (1), 302/2026 (1), 312/2026 (1), 317/2026 (4 కేసులు 8 ట్రాన్స్‌ఫార్మర్లు)  
లక్కవరం P.S: క్రైమ్ నెం. 77/2026 (3), 78/2026 (2 కేసులు 8 ట్రాన్స్‌ఫార్మర్లు)  
నల్లజర్ల P.S: క్రైమ్ నెం. 223/2026 (1), 225/2026 (3), 246/2026 (7), 249/2026 (4 కేసులు 15 ట్రాన్స్‌ఫార్మర్లు )  
కొయ్యలగూడెం P.S: క్రైమ్ నెం. 119/2026 (1 కేసులు 2 ట్రాన్స్‌ఫార్మర్లు )  
 దేవరపల్లి P.S: క్రైమ్ నెం. 240/2026 (1 కేసులు 1 ట్రాన్స్‌ఫార్మర్)  
 భీమడోలు P.S: క్రైమ్ నెం. 150/2026 (1 కేసు 1 ట్రాన్స్‌ఫార్మర్)  
( పై 13 కేసులలో మొత్తం 35 ట్రాన్స్‌ఫార్మర్లు కు సంబందించి 1020 K.G. ల రాగి వైర్ స్వాదినం చేసుకోవడం అయినది, రికవరీ సొత్తు విలువ Rs: 10,00,0,00/- ఉంటుంది.)

రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ ముఠాను చాకచక్యంగా పట్టుకున్న లక్కవరం ఎస్.ఐ Sk. జబీర్ మరియు పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. ముద్దాయిలను రిమాండ్ నిమిత్తం గౌరవ న్యాయస్థానంలో హాజరుపరచడం జరుగుతోంది.
సహకరించిన సిబ్బంది.

M.V.Subhash, CI JR Gudem Circle,
SK.Jabeer, SI of Lakkavaram PS,
N.Veera Prasada, SI Of Jangareddigudem PS
N.V.Sampath Kumar ASI of J.R.Gudem PS
N.Ramesh of PC -2553 Of J.R.Gudem PS
Sk.Shan Babu PC- 2358 of J.R.Gudem PS.