పెదవేగి జెడ్పీటీసీగా చింతమనేని నవ్యశ్రీ ఏకగ్రీవం ఖరారు

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ఏలూరు జిల్లా

  • పెదవేగి జెడ్పీటీసీగా చింతమనేని నవ్యశ్రీ ఏకగ్రీవం ఖరారు – అధికారికంగా ఎన్నికల డిక్లరేషన్ పత్రం జారీ చేసిన ఎన్నికల అధికారులు.
  • ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రం స్వీకరణ.
  • సర్టిఫికెట్ అందుకునే సమయంలో నవ్యశ్రీ వెంటే నిలిచిన భర్త వంకినేని పృధ్వీ, సోదరుడు చింతమనేని ప్రేమ్ సహా సన్నిహితులు, కూటమి నాయకులు.
  • ప్రచార జోరుతో ప్రత్యర్థులు పోటీ నుంచి తప్పుకోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైన కూటమి అభ్యర్థి
  • ఏలూరు జెడ్పీ చైర్‌పర్సన్ పీఠం దిశగా మరో ముందడుగు – చింతమనేని మూడో తరం వారసురాలు ఏకగ్రీవ పత్రం అందుకోవడంతో సర్వత్రా మిన్నంటిన కూటమి సంబరాలు.