మంగళగిరిలోని ఏపీఎస్పీ 6 వ బెటాలియన్ లో పోలీసు అమర వీరుల దినం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు,

భారత్ డిజిటల్ న్యూస్ అమరావతి..అమరావతి

మంగళగిరిలోని ఏపీఎస్పీ 6 వ బెటాలియన్ లో పోలీసు అమర వీరుల దినం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు,

విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు బలగాలకు నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి, హోం మంత్రి, డీజీపీ తదితరులు

Ammiraju Udaya Shankar.sharma News Editor…హోం మంత్రి వంగలపూడి అనిత కామెంట్స్

మాతృభూమి రక్షణ, ప్రజారక్షణ కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన వారిని గౌరవించుకునే సందర్భమిది.

1959 అక్టోబర్ 21న లడఖ్‌లో చైనా సైనికుల దాడిని తిప్పికొడుతూ 10 మంది పోలీసులు వీరమరణం పొందారు.

ఖాకీ అంటే బాధ్యత-పోలీసు అంటే భరోసా.

ప్రజల రక్షణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టే పోలీసు వృత్తి ఎంతో గొప్పది.

ఆపదలో ఉన్నవారికి పోలీసులే ధైర్యం, స్థైర్యం. ప్రమాదం జరిగినా… నేరం జరిగినా…ముందుగా గుర్తుకొచ్చేది పోలీసులే.

మహిళా భద్రతకు, మాదకద్రవ్యాల నిర్మూలనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం.

పోలీసులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మెరుగైన శిక్షణ ఇస్తున్నాము.

పోలీసుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం.

మీరు ధరించిన ఖాకీ దుస్తులు, అమరవీరుల త్యాగాల వారసత్వాలకు ప్రతీక.

అమరవీరుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుందాం.. వారి త్యాగాలను మరవకుండా, వారి కుటుంబాలకు అండగా ఉందాం… అని హోం మంత్రి అనిత. అన్నారు..