సన్న బియ్యం కిలో రూ.95.. నిత్యావసరాల ధరలు భగ్గు

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..సన్న బియ్యం కిలో రూ.95.. నిత్యావసరాల ధరలు భగ్గు

గత ఆగస్టు, సెప్టెంబర్‌తో పోలిస్తే అక్టోబరులో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి. సన్న బియ్యం కిలో రూ.65 – 75 నుంచి రూ.85 – 95కు చేరింది.

25 కిలోల సన్న బియ్యం బస్తా ధర గతంలో రూ.1,400–1,500 ఉండగా, ప్రస్తుతం బ్రాండ్‌ను బట్టి రూ.2,000–2,500కు చేరింది. ఒక్కో బస్తాపై రూ.600–1,000 అదనపు భారం పడుతోంది.

కందిపప్పు రూ.120 నుంచి రూ.150–160కు, మినపప్పు రూ.120 నుంచి రూ.140కు, పెసరపప్పు రూ.106 నుంచి రూ.112కు, శనగపప్పు రూ.80 నుంచి రూ.95–100కు పెరిగాయి.

గుండు మిర్చి రూ.330 నుంచి రూ.420కు, బాస్మతి బియ్యం రూ.113 నుంచి రూ.140–150కు, చక్కెర రూ.43 నుంచి రూ.56కు, నువ్వులు రూ.160 నుంచి రూ.200కు చేరాయి. వర్షాల అసమానతలు, పంటల దిగుబడిపై ఆందోళనల మధ్య అక్రమ నిల్వలు, అధిక ధరల విక్రయాలపై నిఘా పెంచి ధరలను నియంత్రించాలని వినియోగదారులు కోరుతున్నారు.