భారత్ డిజిటల్ న్యూస్ ఢిల్లీ….బీజేపీ డీలిమిటేషన్ బిల్లుకు వైసీపీ మద్దతు?….
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను ఆమోదించేందుకు కేంద్రం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి, 2029 ఎన్నికల నుంచే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.

గతంలో ఈ బిల్లుకు మద్దతిచ్చిన వైసీపీ.. తాజా పరిణామాల నేపథ్యంలో ఎలాంటి వైఖరి తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై ఆ పార్టీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది…