భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..తెలుగు రాష్ట్రాల్లో మూడ్రోజులపాటు భారీ వర్షాలు: వాతావరణ శాఖ…
ఏపీ, తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడ్రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో భారీ వర్షాలతో పాటు బలమైన గాలులు వీస్తాయని, రాయలసీమలోనూ ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొంది. తెలంగాణలోని పలు జిల్లాలకు కూడా రెయిన్ అలర్ట్ జారీ చేయగా, పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది….
