విశాఖకు వచ్చి అదృశ్యమైన అస్సాం యువతి..!శ్రీకాకుళంలో అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యం..!

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..విశాఖకు వచ్చి అదృశ్యమైన అస్సాం యువతి..!శ్రీకాకుళంలో అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యం..!

విశాఖలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన అస్సాంకు చెందిన హిమశ్రీ బోరో(20) వివేక్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుండగా అదృశ్యమైంది.

రైలులో రద్దీ ఎక్కువగా ఉందని.. బోగీలో తాను ఒక్కతే అమ్మాయిని ఉన్నానని హిమశ్రీ భయపడుతూ చెప్పినట్లు సమాచారం.

అనంతరం శ్రీకాకుళం జిల్లాలో ఆమె మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభించింది.
రైలులో అదృశ్యమై.. పట్టాల పక్కన శవమై తేలిన యువతి

అస్సాంలోని గౌహాతికి చెందిన హిమశ్రీ బోరో(20) తన డ్యాన్స్ గ్రూప్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లింది

అక్టోబర్ 6న కన్యాకుమారి-దిబ్రూగర్ వివేక్ ఎక్స్‌ప్రెస్‌లో గౌహాతికి తిరిగి వెళ్తుండగా.. తెల్లవారుజామున హిమశ్రీ అదృశ్యం

అదృశ్యం అవ్వడానికి ముందు.. తెల్లవారుజామున 2:39 గంటలకు ఓ ఫ్రెండ్‌కి ఫోన్ చేసి, కొందరు తనని వేధిస్తున్నారని చెప్పిన హిమశ్రీ

ఆ తర్వాత హిమశ్రీ బోరో ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది

అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోని టికులంపాడు వద్ద రైలు పట్టాల పక్కన హిమశ్రీ మృతదేహం గుర్తించిన పోలీసులు

ఆమె కదులుతున్న రైలు నుంచి కిందపడిందా? లేక ఎవరైనా తోసేశారా? అనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు

రైలులో ఆమెకు సంబంధించిన బ్యాగులు లభించినట్లు వెల్లడించిన అధికారులు.

హిమశ్రీ రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందిందా.. ఎవరైనా రైలు నుంచి తోసేశారా అనే కోణాల్లో రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

యువతి మృతికి అసలు కారణం పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.