ఇంద్రకీలాద్రి క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేసిన

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..ఇంద్రకీలాద్రి క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేసిన

​అఖిల భారత విశ్వహిందూ పరిషత్ కార్యదర్శి మిలింద్ పరాండే
​
​ఇంద్రకీలాద్రి,
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన జగన్మాత శ్రీ కనకదుర్గమ్మవారిని అఖిల భారత విశ్వహిందూ పరిషత్
( విహచ్ పి ))
ప్రధాన కార్యదర్శి శ్రీ మిలింద్ పరాండే (Milind Parande) శనివారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.
​ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ అర్చకులు సాంప్రదాయబద్ధంగా సాదర స్వాగతం పలికారు. శ్రీ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం, వేద ఆశీర్వచన మండపంలో వేద పండితులు వారికి వేదోక్తంగా ఆశీర్వచనం అందజేశారు. దేవస్థాన అధికారులు శ్రీ అమ్మవారి శేషవస్త్రం , ప్రసాదాలు మరియు చిత్రపటాన్ని అందజేశారు.
​ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు ఓబులశెట్టి వెంకటేశ్వర్లు, కోశాధికారి దుర్గా ప్రసాద్ రాజు, రాష్ట్ర సంఘటనామంత్రి శ్రీనివాసరెడ్డి, విజయవాడ మహానగర కార్యదర్శి పొట్టి శ్రీహరి, సహ కార్యదర్శి కొంపల్లి శ్రీనివాస్, ఆలయ ధర్మకర్తలమండలి సభ్యులు రాఘవరాజు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.