భారత్ డిజిటల్ న్యూస్ ఢిల్లీ….తీర్పులు ఇంగ్లీష్‌లోనే ఎందుకు? భారతీయ భాషలకు న్యాయవ్యవస్థలో పెద్దపీట వేయాలి: అలహాబాద్ హైకోర్టు జడ్జి
రిటైర్మెంట్ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గౌతమ్ చౌధరి కీలక వ్యాఖ్యలు చేశారు.
స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 80 ఏళ్లు గడుస్తున్నా భారత న్యాయవ్యవస్థ ఇంకా ఇంగ్లీష్‌పైనే ఎందుకు ఎక్కువగా ఆధారపడుతోందని ప్రశ్నించారు.
హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో న్యాయమూర్తులు హిందీలోనే తీర్పులు రాయాలని, ఇతర రాష్ట్రాల్లో స్థానిక ప్రాంతీయ భాషల్లో తీర్పులు వెలువరించాలని సూచించారు.
న్యాయపరమైన అంశాలను ఇంగ్లీష్‌లోనే మెరుగ్గా వ్యక్తీకరించగలమని భావించడానికి ఎలాంటి కారణం లేదని స్పష్టం చేశారు.
తన వ్యాఖ్యలు ఇంగ్లీష్‌కు లేదా మరే ఇతర భాషకు వ్యతిరేకం కాదని కూడా ఆయన వివరించారు.

స్వయంగా జస్టిస్ గౌతమ్ చౌధరి 2024 సెప్టెంబర్ నాటికి హిందీలో 21,000కు పైగా తీర్పులు వెలువరించినట్లు హైకోర్టు ప్రొఫైల్ వెల్లడిస్తోంది.