భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కౌంటింగ్ కేంద్రంలో ఆందోళనకర ఘటన!
విధుల్లో ఉండగా గుండెపోటుకు గురైన ఆంధ్రజ్యోతి రిపోర్టర్ చింతకాయల గిరి..!
నర్సీపట్నం కౌంటింగ్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న నాతవరం మండల ఆంధ్రజ్యోతి రిపోర్టర్ చింతకాయల గిరి అకస్మాత్తుగా గుండెపోటుకు గురై అస్వస్థతకు లోనయ్యారు. అయితే కౌంటింగ్ కేంద్రంలో అంబులెన్స్ సదుపాయం లేకపోవడంతో కొంత ఇబ్బంది ఎదురైంది.

విషయం తెలుసుకున్న నాతవరం ఎస్సై తారకేశ్వరరావు వెంటనే స్పందించి, పోలీసుల సహాయంతో గిరిని వేగంగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో తోటి మీడియా ప్రతినిధుల్లో ఆందోళన నెలకొంది.