ఆవుల మంద మీదకు దూసుకెళ్లిన బొగ్గు లారీ! సోనాపూర్ లో ఉద్రిక్తత

భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం సోనాపూర్ గ్రామం వద్ద బొగ్గు లోడు లారీ ఆవుల మంద మీదకు దూసుకెళ్లింది. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ఈ ప్రాంతంలో సింగరేణి బొగ్గు లారీల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, లారీలు అతివేగంగా వెళ్తుండటం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని సోనాపూర్ గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సంబంధిత సింగరేణి అధికారులు తెలపాలని, లారీల వేగాన్ని నియంత్రించి గ్రామస్తులకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు…