భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం..మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్ కృతిక శుక్ల
నవంబర్ 1న నాలుగు మున్సిపాలిటీల్లో పోలింగ్.. 3న ఓట్ల లెక్కింపు
పల్నాడు: జిల్లాలోని వినుకొండ, చిలకలూరిపేట, మాచర్ల, సత్తెనపల్లి నాలుగు మున్సిపాలిటీల్లో నవంబర్ 1న జరగనున్న ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కృతిక శుక్ల తెలిపారు.
జిల్లాలో 118 పోలింగ్ లొకేషన్లలో 308 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, 1,840 మంది సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు. మొత్తం 156 వార్డుల్లో 398 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని తెలిపారు.
జిల్లావ్యాప్తంగా 2,28,456 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. చిలకలూరిపేటలో అత్యధికంగా 86,554 మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు.

ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 117 సమస్యాత్మక, 95 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి వెబ్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీసు బందోబస్తు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, నిఘా బృందాలతో పటిష్ట భద్రత కల్పిస్తున్నామన్నారు.
అక్టోబర్ 31న పోలింగ్ సామగ్రి పంపిణీ చేయనున్నట్లు, నవంబర్ 3న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
ప్రజలందరూ నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.