భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…..కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ
జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి
అక్టోబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్ 23 వరకు నామినేషన్ల స్వీకరణ
నవంబర్ 3న పోలింగ్, 5న ఓట్ల లెక్కింపు
––జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డీకే బాలాజి
మచిలీపట్నం: అక్టోబరు 19, 2026
కృష్ణా జిల్లాలో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (ఎంపీటీసీ), జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (జడ్పీటీసీ) ఎన్నికల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం (19.10.2026) నోటిఫికేషన్ జారీ చేసిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డీకే బాలాజి ఒక ప్రకటనలో తెలిపారు. నోటిఫికేషన్ జారీతో జిల్లావ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం సక్రమంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

కృష్ణా జిల్లాలో మొత్తం 26 మండల ప్రజా పరిషత్తులు, 26 జడ్పీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాలు, 352 ఎంపీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాలు ఉన్నాయని, జిల్లావ్యాప్తంగా 1,266 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనుండగా, మొత్తం ఓటర్లు 9,98,054 మంది ఉన్నారని చెప్పారు. మండలాల వారీగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను షెడ్యూల్ ప్రకారం చేపట్టనున్నట్లు తెలిపారు.
ఎన్నికల షెడ్యూల్ వివరాలు:
రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, అక్టోబర్ 21వ తేదీన రిటర్నింగ్ అధికారులు (ఆర్ఓ), ఎన్నికల అధికారులు (ఈఓ) ఎన్నికల నోటీసు జారీ చేస్తారన్నారు. నామినేషన్ల స్వీకరణకు అక్టోబర్ 23 చివరి తేదీగా నిర్ణయించగా, అక్టోబర్ 24న నామినేషన్ల పరిశీలన, అదేవిధంగా తిరస్కరించిన నామినేషన్లపై అక్టోబర్ 25న అప్పీళ్లు స్వీకరిస్తారన్నారు. ఆ అప్పీళ్లను అక్టోబర్ 26న పరిష్కరిస్తారని తెలిపారు.
నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 27 చివరి తేదీ కాగా, అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించటం జరుగుతుందన్నారు. నవంబర్ 3న పోలింగ్ నిర్వహిస్తామని, అవసరం మేరకు నవంబర్ 4న రీపోలింగ్ చేపడతామన్నారు. నవంబర్ 5న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను ప్రకటించనున్నట్లు తెలిపారు.
మండల పరిషత్, జిల్లా పరిషత్ పరోక్ష ఎన్నికల షెడ్యూల్:
మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ), జిల్లా పరిషత్ చైర్పర్సన్ (జడ్పీ చైర్పర్సన్) ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నవంబర్ 3న నోటిఫికేషన్ జారీ చేస్తుందన్నారు. సభ్యులకు నవంబర్ 7వ తేదీన లేదా అంతకుముందు నోటీసులు జారీ చేస్తామన్నారు. ఎంపీపీ, జడ్పీ చైర్పర్సన్ ఎన్నికల కోసం ప్రత్యేక సమావేశాలను నవంబర్ 11 లేదా 12 తేదీల్లో నిర్వహించినట్లు తెలిపారు.
మండలాల వారీగా ఎన్నికల వివరాలు:
అవనిగడ్డ మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలు, 38 పోలింగ్ కేంద్రాలు, 31,772 మంది ఓటర్లు ఉన్నారు. బాపులపాడు మండలంలో 24 ఎంపీటీసీ స్థానాలు, 91 పోలింగ్ కేంద్రాలు, 72,321 మంది ఓటర్లు; బంటుమిల్లి మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలు, 44 పోలింగ్ కేంద్రాలు, 36,651 మంది ఓటర్లు; చల్లపల్లి మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలు, 48 పోలింగ్ కేంద్రాలు, 42,825 మంది ఓటర్లు ఉన్నారు.
గన్నవరం మండలంలో 25 ఎంపీటీసీ స్థానాలు, 96 పోలింగ్ కేంద్రాలు, 75,028 మంది ఓటర్లు; ఘంటసాల మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలు, 43 పోలింగ్ కేంద్రాలు, 33,134 మంది ఓటర్లు; గుడివాడ మండలంలో 6 ఎంపీటీసీ స్థానాలు, 24 పోలింగ్ కేంద్రాలు, 15,587 మంది ఓటర్లు; గుడ్లవల్లేరు మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలు, 50 పోలింగ్ కేంద్రాలు, 41,563 మంది ఓటర్లు ఉన్నారు.
గూడూరు మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలు, 55 పోలింగ్ కేంద్రాలు, 40,025 మంది ఓటర్లు; కంకిపాడు మండలంలో 20 ఎంపీటీసీ స్థానాలు, 70 పోలింగ్ కేంద్రాలు, 55,935 మంది ఓటర్లు; కోడూరు మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలు, 41 పోలింగ్ కేంద్రాలు, 35,966 మంది ఓటర్లు; కృత్తివెన్ను మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలు, 46 పోలింగ్ కేంద్రాలు, 37,961 మంది ఓటర్లు ఉన్నారు.
మచిలీపట్నం ఉత్తర మండలంలో 9 ఎంపీటీసీ స్థానాలు, 36 పోలింగ్ కేంద్రాలు, 29,859 మంది ఓటర్లు; మచిలీపట్నం దక్షిణ మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలు, 38 పోలింగ్ కేంద్రాలు, 27,764 మంది ఓటర్లు; మోపిదేవి మండలంలో 10 ఎంపీటీసీ స్థానాలు, 38 పోలింగ్ కేంద్రాలు, 28,657 మంది ఓటర్లు; మొవ్వ మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలు, 53 పోలింగ్ కేంద్రాలు, 41,469 మంది ఓటర్లు ఉన్నారు.
నాగాయలంక మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలు, 45 పోలింగ్ కేంద్రాలు, 39,025 మంది ఓటర్లు; నందివాడ మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలు, 44 పోలింగ్ కేంద్రాలు, 29,889 మంది ఓటర్లు; పామర్రు మండలంలో 16 ఎంపీటీసీ స్థానాలు, 58…