బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, నవంబర్ 1, 2 తేదీల్లో ఏపీకి భారీ వర్ష సూచన

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, నవంబర్ 1, 2 తేదీల్లో ఏపీకి భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలోని దక్షిణ అండమాన్ ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఇది రానున్న 48 గంటల్లో వాయుగుండంగా బలపడనుందని తెలిపింది.

దీని ప్రభావంతో నవంబర్ 1, 2న కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా ప్రస్తుత ‘అర్నబ్’ తుపాను కారణంగా ఏపీలో సుమారు 3 లక్షలకు పైగా హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. ఇప్పటికీ కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి…..