కూటమి ఏకత్రాటి మీద కలిసి పోటీ చేస్తుంది

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..కూటమి ఏకత్రాటి మీద కలిసి పోటీ చేస్తుంది

అరమరికలు లేకుండా ఏకాభిప్రాయంతో ముందుకు వెళుతున్నాం

-జనసేన పార్టీ మచిలీపట్టణం పార్లమెంట్ నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్త మండలి వెంకట్రామ్

అవనిగడ్డ: నియోజకవర్గంలో కూటమి ఏకత్రాటి మీద కలిసి పోటీ చేస్తుందని జనసేన పార్టీ మచిలీపట్టణం పార్లమెంట్ నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్త మండలి వెంకట్రామ్ అన్నారు. శుక్రవారం అవనిగడ్డలోని తమ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో అభ్యర్థుల ఎంపిక అంశంలో ఎటువంటి అపోహలకు తావు లేదన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి విక్కుర్తి శ్రీనివాసరావుతో తాము పరస్పరం చర్చించుకుని ప్రజాదరణ కలిగిన వారిని అభ్యర్థులుగా నిలబెట్టడానికి ఎలాంటి అరమరికలు లేకుండా ఏకాభిప్రాయంతో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. చాలామంది ఆశావహులు నామినేషన్లు వేశారని, వారితో చర్చించి ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఉపసంహరణ తర్వాత, కూటమి అభ్యర్థులను ప్రకటించి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని, కలసికట్టుగానే ముందుకు వెళ్లి నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలు గమనించి కూటమి అభ్యర్థులకు అఖండ విజయాన్ని చేకూరుస్తారని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.