భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…..జనసేనలో చేరికలు
చల్లపల్లికి చెందిన పలువురు జనసేన పార్టీలో చేరారు. మంగళవారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. చల్లపల్లికి చెందిన బెల్లంకొండ శివ కేశవులు, బెల్లంకొండ శిరీష, నాగ రోహిత్, చెన్ను రామాంజనేయులు, బెల్లపు శివప్రసాద్ కుమార్, బెల్లపు శివరామకృష్ణ, మిరియాల వెంకట నాగేంద్ర వరప్రసాద్ జనసేన పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, జనసేన పార్టీ మచిలీపట్టణం పార్లమెంట్ నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్త మండలి వెంకట్రామ్ వారికి జనసేన కండువాలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు చోడగం విమల్ కృష్ణ, టౌన్ అధ్యక్షులు, సొసైటీ చైర్మన్ బొందలపాటి వీరబాబు, మాజీ సర్పంచ్ కొల్లూరి కోటేశ్వరరావు, ఏఎంసీ డైరెక్టర్లు సూదాని నందగోపాల్, అంకాని మహేంద్ర, పార్టీ నాయకులు తోట మురళీకృష్ణ, పసుపులేటి రవికుమార్, మిరియాల జితేంద్ర, సోమిశెట్టి రాఘవ, రాయవరపు నాంచారయ్య, మడమల రంజిత్, సూదాని మాధవరావు తదితరులు పాల్గొన్నారు.
