భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..ప్రజల అనారోగ్యానికి కోళ్ల మాంసం వ్యర్థాల ఎర్ర
- హైదరాబాద్ నుంచి కోడి మాంసం వ్యర్థాలు దిగుమతి
- పల్నాడు చేపల చెరువుల్లో కలుపుతున్న మాఫియా హైదరాబాద్ నుంచి ప్రమాదకర కోడి మాంసం వ్యర్థాలు ఆంధ్రప్రదేశ్ కి భారీగా దిగుమతి.
పల్నాడు జిల్లా వ్యాప్తంగా చేపల చెరువుల్లో కోళ్ల మాంసం వ్యర్థాలను కలిపి ప్రజల ఆరోగ్యం దెబ్బతీస్తున్న మాఫీయా.
అమరావతి, నరసరావుపేట మండలం కేతముక్కల అగ్రహారం , లింగంగుంట్ల, చిలకలూరిపేట, వినుకొండ తదితర ప్రాంతాల్లోని చేపల చెరువుల్లో కలిపిన కోళ్ల వ్యర్థాలతో కలుషితం.
పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపి, తురకపాలెం (పమిడిపాడు డొంక) వద్ద చెరువుల్లో ప్రమాదకర పంగస్ చేపల పెంపకం. రెస్టారెంట్లు, హోటల్స్ కి తక్కువ ధరకు ఈ చేపల విక్రయం. క్యాట్ ఫిష్, రూప్ చంద్ చేపలకు కూడా దాణాగా కోళ్ల వ్యర్థాలు.
హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన కోళ్ల మాంసం వ్యర్థాలను తొండపి చెరువులో కలుపుతుండగా పట్టుకున్న ముప్పాళ్ల పోలీసులు.
వినుకొండ, మాచర్ల, నకరికల్లుకు చెందిన కొంత మంది వ్యాపారులు మాఫీయా సిండికేట్ గా కోడి మాంసం వ్యర్థాలు సేకరించి చేపల చెరువులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు.
ప్రమాదకర బ్యాక్టీరియా, వైరస్ వ్యాపించి ప్రజలు, పశువుల ఆరోగ్యం దెబ్బతింటున్న పట్టించుకోని అధికారులు.

ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయకుండా మాముళ్లు తీసుకొని మాఫియాకు సహకరిస్తున్న పశుసంవర్ధక, మత్స్య శాఖ యంత్రాంగం.
