పవన్ కల్యాణ్ కు సర్జరీ విజయవంతం…

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..పవన్ కల్యాణ్ కు సర్జరీ విజయవంతం…

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కి ముంబైలో జరిగిన కుడి భుజం శస్త్రచికిత్స విజయవంతమైంది. ఆర్థోపెడిక్ సర్జన్ డా.దిన్షా పార్థీవాలా బృందం మూడున్నర గంటల పాటు సర్జరీని చేసింది. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నట్లు జనసేన పార్టీ పేర్కొంది.

ఆపరేషన్ థియేటర్ నుంచి రికవరీ రూమ్ కి తీసుకొచ్చారని.. అనస్తీషియా ప్రభావం నుంచి బయటకు వస్తున్నారని తెలిపింది…