భారత్ డిజిటల్ న్యూస్ అమరావతి..వార్డు సభ్యుల ఏకగ్రీవాలపై ఈసీ హెచ్చరికలు
అమరావతి :
ఏపీలో వార్డు సభ్యుల పదవులను ఏకగ్రీవం కోసం వేలం వేయడాన్ని తీవ్రంగా రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఖండించింది. ఇది అక్రమమని, దోషులకు ఏడాది జైలు శిక్షతో పాటు ఆరేళ్లు పోటీ చేయకుండా అనర్హత వేటు వేస్తామని హెచ్చరించింది. ఈ ఆరోపణలపై విచారణకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయనుంది.

ఆరోపణలున్న చోట కలెక్టర్ అనుమతి లేకుండా ఏకగ్రీవ ఫలితాలు ప్రకటించరు. ప్రాథమిక ఆధారాలుంటే ఆ వార్డుల్లో ఎన్నికలను నిలిపివేసే అధికారం SECకి ఉంది.