భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్
డ్రైవింగ్ లైసెన్స్ ఆన్లైన్ సేవల్లో ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డీఎల్, ఆధార్ కార్డుల్లో పేర్లు, వివరాలు సరిపోలకపోతే దరఖాస్తులు నిలిచిపోతున్నాయి. దీనివల్ల ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ల జారీలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ సమస్య ఉన్నవారు ముందుగా ఆర్టీవో కార్యాలయానికి వెళ్లి వివరాలను సవరించుకోవాలని రవాణాశాఖ అధికారులు సూచించారు….
