అరిలోవలో పోలీసుల కార్డన్ సెర్చ్.. 7 వాహనాలు సీజ్‌!

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం……అరిలోవలో పోలీసుల కార్డన్ సెర్చ్.. 7 వాహనాలు సీజ్‌!

నంబర్ ప్లేట్లు, సరైన పత్రాలు లేని వాహనాల స్వాధీనం..

విశాఖపట్నం:

విశాఖ నగరంలోని అరిలోవ పోలీస్‌స్టేషన్‌ పరిధి, సెంట్రల్‌ జైలు సమీపంలోని కృష్ణాపురంలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు.

అక్రమ వస్తువుల గుర్తింపు, కొత్తగా అద్దెకు తీసుకున్న ఇళ్లు, నివాసితుల వివరాల తనిఖీతో పాటు అనుమానాస్పద వ్యక్తుల పరిశీలన కోసం ఈ ఆపరేషన్‌ చేపట్టారు.

ఈ సందర్భంగా ఇళ్లను తనిఖీ చేయడంతో పాటు సరైన పత్రాలు లేని, నంబర్‌ ప్లేట్లు లేని 5 బైక్‌లు, 2 స్కూటర్లతో కలిపి మొత్తం 7 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని అరిలోవ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

వాహన యజమానులు చెల్లుబాటయ్యే ఆర్సీ, ఇన్సూరెన్స్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, గుర్తింపు పత్రాలను సమర్పించాలని పోలీసులు సూచించారు. అద్దెదారుల వివరాల తనిఖీలు కొనసాగుతున్నాయని, అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో 112కు ఫోన్‌ చేయాలని సూచించారు.