భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…..ఏపీలో పింఛన్‌దారులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి కొత్త విధానం
ఏపీలో పింఛన్ల పంపిణీ విధానంలో నవంబర్ 1 నుంచి కీలక మార్పు అమల్లోకి రానుంది.
కేంద్ర ప్రభుత్వ వాటా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ కానుండగా..
రాష్ట్ర ప్రభుత్వం అందించే వాటాను గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి అందించనున్నారు.

ప్రస్తుతం వృద్ధులు, ఒంటరి మహిళలకు నెలకు రూ.4,000 పింఛన్లో కేంద్ర వాటా రూ.200, రాష్ట్ర వాటా రూ.3,800గా ఉంది.
దివ్యాంగులకు రూ.6,000లో కేంద్ర వాటా రూ.300, రాష్ట్ర వాటా రూ.5,700గా ఉంది.
కేంద్ర వాటా ఖాతాలో జమ కావాలంటే లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాను ఆధార్‌తో తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాలి.
ఆధార్ లింక్ లేకపోతే కేంద్ర వాటా జమ కాకపోవచ్చు.