భారత్‌ వద్ద 190 అణ్వాయుధాలు.సిప్రి 2026 నివేదిక వెల్లడి

భారత్ న్యూస్ విశాఖపట్నం..భారత్‌ వద్ద 190 అణ్వాయుధాలు.సిప్రి 2026 నివేదిక వెల్లడి

ఈ సంవత్సరం జనవరి నాటికి భారత్‌ వద్ద 190 అణ్వాయుధాలు ఉన్నట్టు స్టాక్‌హోమ్‌ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ(సిప్రి) సోమవారం తెలిపింది. నిరుడుతో పోలిస్తే పది ఆయుధాలను భారత్‌ ఎక్కువగా సమకూర్చుకుందని తెలిపింది. పాకిస్థాన్‌ దగ్గర సుమారు 170 అణ్వాయుధాలు ఉన్నాయని.. నిరుటితో పోలిస్తే ఈ సంఖ్య మారలేదని తన 2026 సంవత్సర నివేదికలో వెల్లడించింది.

భారత్‌ తన వద్ద ఉన్నవాటిలో 12 అణ్వాయుధాలను మోహరించిందని సిప్రి తెలిపింది. చైనా లాంటి దీర్ఘ శ్రేణి లక్ష్యాలను ఛేధించగల ఆయుధాలను భారత్‌ సిద్ధం చేసుకొందని వెల్లడించింది. ఆపరేషన్‌ సిందూర్‌లో పాక్‌ స్థావరాలపై భారత్‌ దాడిని తన నివేదికలో ప్రస్తావించింది. మరోవైపు చైనా తన అణ్వాయుధాల సంఖ్యను 620కి, రష్యా 4,400కు పెంచుకుందని చెప్పింది. అమెరికా అణ్వాయుధాల సంఖ్య(3700)లో ఎలాంటి మార్పు లేదని ప్రకటించింది.