భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..ఇంద్రకీలాద్రి క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేసిన
అఖిల భారత విశ్వహిందూ పరిషత్ కార్యదర్శి మిలింద్ పరాండే
ఇంద్రకీలాద్రి,
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన జగన్మాత శ్రీ కనకదుర్గమ్మవారిని అఖిల భారత విశ్వహిందూ పరిషత్
( విహచ్ పి ))
ప్రధాన కార్యదర్శి శ్రీ మిలింద్ పరాండే (Milind Parande) శనివారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.
ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ అర్చకులు సాంప్రదాయబద్ధంగా సాదర స్వాగతం పలికారు. శ్రీ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం, వేద ఆశీర్వచన మండపంలో వేద పండితులు వారికి వేదోక్తంగా ఆశీర్వచనం అందజేశారు. దేవస్థాన అధికారులు శ్రీ అమ్మవారి శేషవస్త్రం , ప్రసాదాలు మరియు చిత్రపటాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు ఓబులశెట్టి వెంకటేశ్వర్లు, కోశాధికారి దుర్గా ప్రసాద్ రాజు, రాష్ట్ర సంఘటనామంత్రి శ్రీనివాసరెడ్డి, విజయవాడ మహానగర కార్యదర్శి పొట్టి శ్రీహరి, సహ కార్యదర్శి కొంపల్లి శ్రీనివాస్, ఆలయ ధర్మకర్తలమండలి సభ్యులు రాఘవరాజు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
