భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నంఏలూరు జిల్లా / చింతలపూడి
చింతలపూడి నియోజకవర్గంలొ రహదారుల అభివృద్ధి పట్ల ప్రజల్లో హర్షం – జిలకరగూడెం వద్ద 800 మీటర్లు పెండింగ్
చింతలపూడి నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో రహదారుల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతుండటంతొ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు,
అయితే చింతలపూడి నుంచి కామవరపుకోట వైపు వెళ్లే ప్రధాన రహదారిలొ జిలకరగూడెం, పోతేపల్లి క్రాస్ రోడ్స్ మధ్య సుమారు 800 మీటర్ల మేర రహదారి మరమ్మతులు చేపట్టకపోవడంతొ స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు,

నియోజకవర్గంలొ అన్ని చోట్ల పనులు పూర్తి చేస్తున్నప్పుడు, ఈ 800 మీటర్ల మేర ఎందుకు వదిలేశారని ఆ ప్రాంతవాసులు ప్రశ్నిస్తున్నారు, అధికారులు ఈ విషయాన్ని గుర్తించి, పెండింగ్ లొ ఉన్న సుమారు 800 మీటర్ల రహదారికి కూడా వెంటనే మరమ్మతులు చేపట్టి, ఆ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నారు.