స్థానిక ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేవరకు పిజిఆర్ఎస్ కార్యక్రమం రద్దు

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..స్థానిక ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేవరకు పిజిఆర్ఎస్ కార్యక్రమం రద్దు

ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ meekosam.ap.gov.in ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు, అర్జీ స్థితి తెలుసుకోవచ్చు

1100 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి ఫిర్యాదు నమోదు, స్థితి తెలుసుకోవచ్చు- జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

       ఏలూరు, అక్టోబర్, 25 ;   ఏలూరు జిల్లాలో స్థానిక సంస్థల  ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు ఉన్న కారణంగా స్థానిక సంస్థల  ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు అనగా డిసెంబర్, 3వ తేదీ వరకు ఏలూరు జిల్లాలో పిజిఆర్ఎస్ కార్యక్రమం  రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.  అర్జీదారులు తమ ఫిర్యాదులను అధికారిక వెబ్‌సైట్ meekosam.ap.gov.in ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని,   ప్రజలు తమ  ఫిర్యాదు నమోదు, ఫిర్యాదుల స్థితి తదితర సమాచారంను  1100  టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి తెలుసుకోవచ్చని కలెక్టర్ వెట్రిసెల్వి తెలియజేసారు..   

(జిల్లా సమాచార శాఖ, ఏలూరు జిల్లా, ఏలూరు వారిచే జారీ చేయబడినది)