భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..కరోనా సమయంలో కేసీఆర్ తెలంగాణను కాపాడిన తీరును కేంద్ర ప్రభుత్వమే మెచ్చుకున్నది.
రేవంత్ రెడ్డికి అలాంటి పనులు చేతకావు, ఎప్పుడూ కేసీఆర్ మీద తప్పుగా మాట్లాడడమే.
నీ దరిద్రపు పాలన వచ్చాకనే రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చింది.
ఇలాంటి సమయంలో అందరి సహకారం తీసుకోవాల్సింది పోయి, క్షుద్ర పూజలు అంటూ ముఖ్యమంత్రి అనేవాడు మాట్లాడతాడా?
ముందుగానే చర్యలు తీసుకోవాలని మేము చెప్పినా కూడా ఈ ప్రభుత్వం కనీస ముందస్తు చర్యలు తీసుకోలేదు.

– మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్.