ఏఎస్ఆర్ జిల్లా పేలుడు ఘటనపై ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆరా

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం….ఏఎస్ఆర్ జిల్లా పేలుడు ఘటనపై ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆరా

అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండలం పినకోట సమీపంలో వాహనంలో పేలుడు సంభవించి నలుగురు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వాహనంలో పేలుడుకుగల కారణాలను ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్‌ని అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనుల నిమిత్తం టిప్పర్ వాహనంలో డీజిల్ తరలిస్తున్న సమయంలో మరో వాహనాన్ని ఢీ కొట్టడం కారణంగా ఒక్కసారిగా పేలుడు సంభవించినట్టు కలెక్టర్ వివరించారు. పేలుడు ధాటికి నలుగురు అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ పేలుడుకుగల కారణాలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.