నేడు ‘మీ భూమి-బ్లాక్ చైన్’ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం

భారత్ డిజిటల్ న్యూస్ అమరావతి..నేడు ‘మీ భూమి-బ్లాక్ చైన్’ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం

ఏపీ : సీఎం చంద్రబాబు నేడు (గురువారం) ‘మీ భూమి–బ్లాక్‌చైన్’ పైలట్ ప్రాజెక్టును వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.

హైపర్ లెడ్జర్ ఫ్యాబ్రిక్ టెక్నాలజీ ఆధారంగా రూపొందిన ఈ వ్యవస్థ ద్వారా భూ రికార్డులు మార్పులు చేయలేని విధంగా ఉంటుంది.

దీంతో అక్రమ మార్పులు, డేటా వ్యత్యాసాలు, భూ కబ్జాలకు అడ్డుకట్ట పడనుంది.

తొలి దశలో 7 జిల్లాల్లోని 7 మండలాల్లో 89 రీ-సర్వే గ్రామాలు, 1.37 లక్షల భూ పార్సెల్‌లను కవర్ చేస్తారు.

దీంతో ఆటో మ్యూటేషన్, సబ్-డివిజన్, ఎక్స్‌టెంట్ కరెక్షన్ వంటి ఎనిమిది సేవలు అందుబాటులోకి రానున్నాయి.