భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..రేపు విద్యాసంస్థలు బంద్!
తెలంగాణ ఈ నెల 24న(శుక్రవారం) రాష్ట్రంలోని విద్యాసంస్థలన్నీ బంద్ చేసి విద్యార్థులు చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని విద్యార్థి సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది.
ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, ఎన్‌ఎస్‌యూఐ, పీడీఎస్‌యూ, ఏఐఎఫ్‌డీఎస్ సంఘాలు ఉద్యమ కార్యాచరణ ప్రారంభించాయి.
విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, NTAను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన నిరసనలో లాఠీఛార్జ్ చేసిన వారిపై చర్యలకు డిమాండ్ చేశారు.

విద్యార్థులపై పెట్టిన కేసులు కూడా వెనక్కి తీసుకోవాలని కోరారు.
