ఈ-కేవైసీ గడువుపై లబ్ధిదారుల ఆందోళన

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..ఈ-కేవైసీ గడువుపై లబ్ధిదారుల ఆందోళన

తెలంగాణ రేషన్ కార్డుదారులకు ఈ-కేవైసీ ప్రక్రియలో బయోమెట్రిక్ సమస్యలు ఎదురవుతున్నాయి.

సర్వర్ సమస్యలు, ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లినవారు, చిన్న పిల్లలు, వృద్ధులు ఈ-కేవైసీ చేయించుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు.

ఈ నెలాఖరులోగా ఈ-కేవైసీ పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించడంతో, లబ్ధిదారులు తమ పేర్లు తొలగిపోతాయేమోనని ఆందోళన చెందుతున్నారు.

గడువును పొడిగించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.