భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..నిమ్మగడ్డ లాకులను పరిశీలించిన వైసీపీ నేత గౌతమ్
ఈరోజు వైసీపీ నేత గౌతమ్ నిమ్మగడ్డ లోని ప్రదాన పంట కాలువ నీటి ప్రవాహంపై నిమ్మగడ్డ వద్ద లాకులను పరిశీలించగా పులిగడ్డ వైపు నీటిని విడుదల చెయ్యకుండా లాకులు బిగించి ఉండటం చూసి విస్మయానికి గురయ్యారు, అవనిగడ్డ దిగువ ప్రాంతానికి సాగు నీరు రాకుండా నిమ్మగడ్డ లాకుల వద్ద తొక్కి ఉంచటం దివిసీమ రైతాంగానికి తీరని అన్యాయం చేసినట్లేనని వెంటనే అధికారులు స్పందించి అవనిగడ్డ దిగువ ప్రాంతాలకు సాగునీరు అందించాలని గౌతమ్ డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ నీటి సంఘ అధ్యక్షులు వర్రే బసవరావు, అద్దంకి శేషు, అప్పికట్ల దసరథ్, శ్రీను పాల్గొన్నారు.
