భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్: అశ్వినీ వైష్ణవ్
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్: అశ్వినీ వైష్ణవ్
దేశంలో ప్రకటించిన 7 బుల్లెట్ ట్రైన్లలో మూడు రైళ్లు తెలంగాణకే దక్కాయని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. వీటి రాకతో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 2 గంటల 35 నిమిషాలు, పుణేకు 2 గంటలు, ముంబైకి 2 గంటల 20 నిమిషాలు, విజయవాడకు కేవలం 70 నిమిషాల్లో చేరుకోవచ్చు. హైదరాబాద్ హైటెక్స్‌లో ఆయన మాట్లాడుతూ, ఐటీ రంగం సాఫ్ట్వేర్ యూజ్ ఎ సర్వీస్ నుంచి AI వైపు వేగంగా అడుగులు వేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

