ఏలూరు జిల్లా కైకలూరు ::::: భారత్ డిజిటల్ న్యూస్ ప్రతినిధి ::::: బిజెపి ఆధ్వర్యంలో సమగ్ర ఓటర్ సర్వే, బి. ఎల్. ఏ -1ల తో వెబెక్స్ ద్వారా జాతీయ నాయకుల దిశానిర్దేశం
భారతీయ జనతా పార్టీ (బి. జె. పి.) కేంద్ర నాయకత్వం పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “సమగ్ర ఓటర్ సర్వే” మరియు సరళ యాప్ ద్వారా బూత్ స్థాయి ఏజెంట్ల (బి. ఎల్. ఏ.) నియామకాలపై బుధవారం జాతీయ, రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకులు వెబెక్స్ (వెబ్స్ ) వర్చువల్ వేదిక ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు
ఈ సమావేశంలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, జాతీయ కార్యదర్శి ఋతురాజ్ సిన్హా పాల్గొని రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల ప్రతినిధులకు మరియు బి. ఎల్. ఏ -1 లకు రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు.
ఈ వెబెక్స్ సమావేశంలో రాష్ట్ర స్థాయి నుండి బిజెపి నేతలు పి.వి.ఎన్. మాధవ్, రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ, ఎస్.ఐ.ఆర్ రాష్ట్ర ఇంచార్జ్ నాగోతు రమేష్ నాయుడు, ఎస్.ఐ.ఆర్ రాష్ట్ర కన్వీనర్ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొని దిశా నిర్దేశం చేశారు.
కైకలూరు నియోజకవర్గంలో చురుగ్గా నియామకాలు జరిగాయని,
ఈ వర్చువల్ సమావేశంలో కైకలూరు నియోజకవర్గ ఇంచార్జ్ బి. ఎల్. ఏ.-1 కోటప్రోలు కృష్ణరావు పాల్గొని నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ సహకారంతో జరుగుతున్న సమగ్ర ఓటర్ సర్వే పురోగతిని జాతీయ నాయకత్వానికి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 175 విధానసభ నియోజకవర్గాల్లో 100% బి. ఏల్. ఎల్ -2 నియామకాలు పూర్తయ్యాయని, మిగిలిన బూత్ స్థాయి కమిటీలను (బి. ఏల్. ఏ.-2, బూత్ టోలి) కూడా అత్యంత వేగంగా పూర్తి చేసి, ప్రతి బూత్ పరిధిలో ఓటర్ల వెరిఫికేషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని జాతీయ నాయకులు స్పష్టం చేశారు. కైకలూరు నియోజకవర్గంలో పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు నియోజక వర్గం లో బి. జే. పి. నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణగా నీతి నిబద్ధతతో పనిచేస్తున్నారని కోటప్రోలు కృష్ణ అన్నారు

