డిసెంబర్ 3 వరకు పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమాలు తాత్కాలిక నిలిపివేత

భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం….డిసెంబర్ 3 వరకు పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమాలు తాత్కాలిక నిలిపివేత

క్షేత్రస్థాయిలోనూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలు రద్దు: జిల్లా కలెక్టర్

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున డిసెంబర్ 3వ తేదీ వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు.

ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మదనపల్లె కలెక్టరేట్‌లో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమాలతో పాటు, క్షేత్రస్థాయిలో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమాలను కూడా డిసెంబర్ 3వ తేదీ వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.