తెలుగు రాష్ట్రాల్లో రానున్న 5 రోజులు భారీ వర్షాలు

భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం..తెలుగు రాష్ట్రాల్లో రానున్న 5 రోజులు భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న 5 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.ఈదురు గాలులతో కూడిన వర్షాలు పలు జిల్లాల్లో నమోదయ్యాయి. గురువారం ఆంధ్రప్రదేశ్లోని మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోనూ పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేయబడింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.