భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..ఏపీలో మౌజన్లు, ఇమామ్లకు గౌరవ వేతనం విడుదల
అమరావతి :
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని మసీదుల్లో సేవలందిస్తున్న 9,982 మంది ఇమామ్లు, మౌజన్లకు మూడు నెలల గౌరవ వేతనం కింద రూ.22.45 కోట్లను విడుదల చేసింది. ఇందులో 4,991 మంది ఇమామ్లు, 4,991 మంది మౌజన్లు ఉన్నారు. ఇమామ్లకు నెలకు రూ.10,000, మౌజన్లకు నెలకు రూ.5,000 చొప్పున చెల్లిస్తున్నారు. గత 27 నెలలకు కలిపి ఇప్పటివరకు మొత్తం రూ.202 కోట్ల గౌరవ వేతనాన్ని అందించినట్లు ప్రభుత్వం తెలిపింది.
