భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ పోటీలకు క్రిసాలిస్ విద్యార్థుల ఎంపిక
ధర్మాజీగూడెం:
రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) పోటీలకు ధర్మాజీగూడెం క్రిసాలిస్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ఎంపికై పాఠశాలకు ఘనత తెచ్చారు,
ఈ విషయాన్ని పాఠశాల డైరెక్టర్లు టి. రాజ్ క్రాంతి, బి. విజయ్ తెలిపారు.
అండర్-19 క్రికెట్ విభాగంలో విద్యార్థి ఎస్. అభినవ్ సాత్విక్ ఎంపికయ్యాడు, ఈ పోటీలు అక్టోబర్ 10 నుండి 12 వరకు చిత్తూరు జిల్లా నగరిలోని కేవీకే గ్రౌండ్స్ లొ జరగనున్నాయి,
అలాగే అండర్-19 రగ్బీ విభాగంలొ వూలాస మహేంద్ర బాబు ఎంపికయ్యాడు. ఈ పోటీలు అక్టోబర్ 10 నుండి 11 వరకు కర్నూలు జిల్లా ఆదర్శ జూనియర్ కళాశాలలొ నిర్వహించనున్నారు,

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను డైరెక్టర్లు, ఉపాధ్యాయ బృందం అభినందించారు, వారికి శిక్షణ ఇచ్చిన పీడీలను ప్రత్యేకంగా ప్రశంసించి, పోటీల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.