స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం

అమరావతి:ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ (వెనుకబడిన తరగతులు) రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్ల శాతాలను ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజేష్ రంజన్ నేతృత్వంలోని కమిషన్ అందించిన నివేదిక, సిఫార్సుల ఆధారంగా మొత్తం 8 విభాగాల్లో (కేటగిరీలలో) రిజర్వేషన్ల శాతాన్ని కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

కేటగిరీల వారీగా బీసీ రిజర్వేషన్ల వివరాలు

మేయర్ పదవులు: 35.29%

మున్సిపల్ చైర్మన్ పదవులు: 33.02%

అర్బన్ వార్డులు: 32.78%

సర్పంచ్ స్థానాలు: 27.95%

పంచాయతీ వార్డులు: 26.73%

ఎంపీటీసీ (MPTC) స్థానాలు: 25.55%

ఎంపీపీ (MPP) పదవులు: 24.60%

జడ్పీటీసీ (ZPTC) స్థానాలు: 24.60%

జడ్పీ చైర్మన్ పదవులు: 23.08%
స్థానిక సంస్థల్లో బీసీ వర్గాలకు జనాభా ప్రాతిపదికన, నిబంధనలకు అనుగుణంగా న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించేందుకే రాజేష్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా ఈ కేటాయింపులు చేపట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.