స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉండాలి-జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉండాలి-జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల

అక్టోబర్ 7:త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యం లో జిల్లాలో ఎం.పీ.టి.సీ., జెడ్.పీ.టి.సీ., మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఎన్నికల నిర్వహణకు సంబంధిత అధికారులు సన్న ద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్‌ లో ఎస్పీ జగదీశ్ తో కలిసి మున్సిపల్ కమిషనర్లు,జిల్లా పరిషత్ సీఈవో, జిల్లా పంచాయతీ అధికారులతో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. 
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ఎన్నికల నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని ఏర్పాట్ల ను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. పురపాలక సంఘాల్లో వార్డు కౌన్సిలర్లు,చైర్మన్ ఎన్నికల నిర్వహణకు అధికారులు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.స్ట్రాంగ్ రూములు,కౌంటింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి ఎన్నికల సామగ్రి,బ్యాలెట్ పత్రాలు,బ్యాలెట్ బాక్సుల భద్రత కోసం అవసరమైన ప్రాంతాల్లో పటిష్టమైన స్ట్రాంగ్ రూములను ముందుగానే గుర్తించాల న్నారు.కౌంటింగ్ నిర్వహణ కు విశాలమైన హాళ్లను ఎంపిక చేసి అవసరమైన మౌలిక వసతులు కల్పిం చాలని సూచించారు. స్ట్రాంగ్ రూములకు డబుల్ లాక్ విధానం అమలు చేయడం తో పాటు భద్రతా ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీల పరిధి లో వార్డు మెంబర్లు, సర్పంచులు,ఎంపీటీసీలు, జడ్పీటీసీల ఎన్నికల నిర్వహణ కు సంబంధించి కూడా అవసరమైన ఏర్పాట్ల ను పూర్తి చేయాలని తెలిపారు.కౌంటింగ్‌కు ముందు బ్యాలెట్ పత్రాలను క్రమబద్ధంగా బండ్లింగ్ చేసే ప్రక్రియను చేపట్టాలని, వార్డు మెంబర్లు,చైర్మన్ తదితర ఎన్నికల కౌంటింగ్ కోసం అవసరమైన మేరకు వేర్వేరు హాల్ లను ఎంపిక చేయాలని సూచించారు. రవాణా, మెటీరియల్ పంపిణీపై కార్యాచరణ ఎన్నికల సామగ్రి రవాణాకు అవసరమైన వాహనా లను ముందుగానే గుర్తించి సమగ్ర రవాణా ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.రోడ్లు, సెక్టార్లు, జోన్ల విభజన తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
ఎన్నికల సామగ్రి పంపిణీ, రిసెప్షన్ ప్రక్రియలను పక డ్బందీ గానిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేయా లన్నారు.అవసరమైన సంఖ్య లో బ్యాలెట్ బాక్సులను ముందుగానే సమకూర్చు కోవాలని సూచించారు.పంచాయతీ ల్లో పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం బ్యాలెట్ బాక్సులను సంబంధిత ట్రెజరీ ల్లో భద్రపరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల సామగ్రిని పోలీస్ ఎస్కార్ట్,బందోబస్తు నడుమ సురక్షితంగా తరలించాలని ఆదేశించారు.పోలింగ్, కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్యను ప్రాతిపదికగా తీసుకుని తగిన సంఖ్య లో పోలింగ్ సిబ్బందిని నియ మించాలని కలెక్టర్ తెలిపారు.కౌంటింగ్ సిబ్బంది ని కూడా ముందుగానే ఎంపిక చేసి వారికి అవసరమైన శిక్షణ అందించాలన్నారు.
మాస్టర్ ట్రైనర్ల ద్వారా శిక్షణ కార్య క్రమాలను సమర్థవంతంగా నిర్వహించి ఎన్నికల విధుల పై సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు.ఎన్నికల నిర్వహణ కు సంబంధించి ప్రతి అంశంపై ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని,ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ సమ న్వయంతోవ్యవహరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఎస్‌ఈసీ-ఈఎంఎస్‌ వెబ్ పోర్టల్‌లో నమోదు చేయాలని, ప్రతి ఎంపీడీఓ కార్యాలయంలో ప్రత్యేక సాంకేతిక సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని, వెబ్ కాస్టింగ్ కి ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎంసీసీ టీమ్స్, ఎఫ్ఎస్డిటీమ్స్, ఎస్ఎస్టి టీమ్స్, ఆర్వోలు, జోనల్, రూట్ అధికారులను ముందుగానే గుర్తించి జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. వీరందరికీ ముందుగానే వివిధ దశల్లో శిక్షణ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. నియామకానికి   ఎన్నికల ఏర్పాట్లలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, ఎలాంటి లోపాలకు తావులేకుండా ముందస్తు చర్యలు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఎస్పీ జగదీశ్ మాట్లాడుతూ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా పని చేయాలి అన్నారు

డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సంజన, జడ్పీ సీఈఓ , డిపిఓ ,ఆర్డీఓలు,డీఎస్పీ లు డిఎల్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.