భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..పింఛన్ కోసం భర్త చనిపోయినట్లుగా నకిలీ పత్రాలు…
విజయవాడ: ప్రభుత్వ పింఛన్ పొందాలనే ఉద్దేశంతో బతికున్న తన భర్త చనిపోయినట్లుగా నకిలీ పత్రాలు సృష్టించిన ఓ మహిళ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో మహిళతో పాటు, లంచం తీసుకుని నకిలీ స్మశాన వాటిక ధ్రువీకరణ పత్రం జారీ చేసిన శానిటరీ ఇన్స్పెక్టర్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడ కానూరు గ్రామ పంచాయతీ ఆఫీస్ రోడ్డులో నివాసం ఉంటున్న యర్రంశెట్టి రమాదేవి (A1) తన భర్త మురళీకృష్ణతో విభేదాల కారణంగా గత 15 ఏళ్లుగా విడిగా ఉంటోంది. ఇటీవల ప్రభుత్వం కొత్త పింఛన్లకు దరఖాస్తులు కోరడంతో.. పింఛన్ పొందేందుకు తన భర్త చనిపోయినట్లుగా చూపించాలని ఆమె పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ శానిటరీ ఇన్స్పెక్టర్ *దారా ఆంటోనీ (A2)*ను సంప్రదించింది. ఆయన రూ.15 వేల లంచం తీసుకుని మురళీకృష్ణ చనిపోయినట్లుగా నకిలీ బరియల్/క్రిమేషన్ సర్టిఫికెట్ జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఆ సర్టిఫికెట్ ఆధారంగా రమాదేవి తాడిగడప మున్సిపాలిటీలో దరఖాస్తు చేసి, అధికారులను నమ్మించి డెత్ సర్టిఫికెట్ కూడా పొందింది.