తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద ఏనుగు బీభత్సం

భారత్ డిజిటల్ న్యూస్ తిరుపతి..తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద ఏనుగు బీభత్సం

చంద్రశేఖర్ అనే మావటికి తీవ్రగాయాలు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద ఏనుగు భీభత్సం, మావటి చంద్రశేఖర్ కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ప్రతిరోజూ సాయంత్రం అమ్మవారి వాహన మండపంలో ఉంజల్ సేవ నిర్వహిస్తారు. ఆ సమయంలో ఏనుగులు ఆలయం వద్దకు తీసుకురావడం ఆనవాయతీ. ఊంజల్ సేవ పూర్తైన తర్వాత ఏనుగులను తిరిగి ఉద్యానవనానికి తీసుకెళుతుండగా ఒక ఏనుగు ఒక్కసారిగా మావటిని కింద వేసి తొక్కివేయడంతో త్రీవ గాయాలయ్యాయి.. దీంతో భక్తులు భయాందోళనలతో పరుగులు తీశారు. 108 సహాయంతో గాయపడిన మావటిని ఆస్పత్రికి తరలించారు…