ఏపీలో కొత్తగా మరో 9లక్షల ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్…..

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..ఏపీలో కొత్తగా మరో 9లక్షల ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్…..

ఏపీలో పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం భారీగా ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతోంది. గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఇప్పటికే మంజూరైన 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలోపు మరో 3 లక్షలు, వచ్చే ఏడాది మరో 3 లక్షల ఇళ్లు మంజూరు చేసేందుకు కేంద్రం అంగీకరించిందని తెలిపారు.

దీంతో మొత్తం మరో 9 లక్షల ఇళ్ల నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ లభించిందన్నారు. 2029 నాటికి రాష్ట్రంలోని ఇల్లు లేని పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించడమే లక్ష్యమని సీఎం చెప్పారు…