హైదరాబాద్‌కు చేరుకున్న భారత్, వెస్టిండీస్ క్రికెట్ జట్లు

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..హైదరాబాద్‌కు చేరుకున్న భారత్, వెస్టిండీస్ క్రికెట్ జట్లు

Oct 13, 2026,

తెలంగాణ : భారత్‌, వెస్టిండీస్‌ క్రికెట్‌ జట్లు మంగళవారం హైదరాబాద్‌కు చేరుకున్నాయి. అక్టోబర్‌ 14న ఉప్పల్‌ స్టేడియంలో జరగనున్న నాలుగో టీ20 మ్యాచ్‌ కోసం ఆటగాళ్లు నగరానికి వచ్చారు. విమానాశ్రయం నుంచి ప్రత్యేక బస్సుల్లో వారిని స్టార్‌ హోటల్‌కు తరలించారు. ఆటగాళ్ల రాక నేపథ్యంలో విమానాశ్రయం నుంచి హోటల్‌ వరకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.