భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..పేకాట స్థావరంపై తడికలపూడి మహిళా ఎస్ఐ వల్లి పద్మ గారు వారి యొక్క సిబ్బంది తో పాటు దాడి చేసి 06 గురుని అరెస్ట్ చేసినారు
👉 జంగారెడ్డి గూడెం ఇన్స్పెక్టర్ శ్రీ ఎం వి సుభాస్ గారి యొక్క ఆదేశాలపై తడికలపూడి మహిళా ఎస్సై వల్లి పద్మ గారికి రాబడిన సమాచారం మేరకు వారి యొక్క సిబ్బందితో కలిసి ఈ రోజు అనగా 07.10.2026 వ తేదీ నాడు కామవరపుకోట మండలం చీపురుగూడెం గ్రామము సాగిపాడు పంచాయతీ గ పేకాట ఆడుతున్న వారిపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు.
👉 దాడిలో 06 గురు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.3,200 నగదు, ఒక మోటార్ సైకిళ్లు మరియు 05 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
👉 నిందితులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి, తదుపరి న్యాయపరమైన చర్యలు చేపట్టినట్లు మహిళా ఎస్ఐ తెలిపారు.
👉 జూదం, పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తాయని, ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.

👉 ప్రజలు తమ పరిసరాల్లో ఎక్కడైనా పేకాట, జూదం లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించినట్లయితే వెంటనే డయల్-112 లేదా 9440796678 కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు.