నేడు భారత్, జింబాబ్వే మహిళల జట్ల మధ్య తొలి వన్డే
భారత మహిళల క్రికెట్ జట్టు శుక్రవారం గుజరాత్‌లోని వడోదర వేదికగా జింబాబ్వేతో తొలి వన్డేలో తలపడనుంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కెప్టెన్‌గా స్మృతి మంధానకు ఇదే మొదటి వన్డే సిరీస్ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల జింబాబ్వేపై 3 టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత జట్టు, అదే జోరును కొనసాగించాలని చూస్తోంది. జట్టులో అనుష్క శర్మ, నికీ ప్రసాద్ స్థానాల్లో ప్రతికా రావల్, హర్లీన్ వచ్చే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ జియో హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
